![]() |
![]() |
.webp)
బుల్లితెరకి రష్మీ పెళ్లి ఒక అసెట్ లాంటిది.. అలాగే మల్లెమాల టీంకి మంచి రేటింగ్స్ రావాలంటే రష్మీ పెళ్లి ఒక గొప్ప కాన్సెప్ట్ కూడా. ఇక ఒకప్పుడు రష్మీ పెళ్లి గురించి ఆడియన్స్ అంతా ఎన్నో ఊహించుకున్నారు. కానీ అనుకున్నవన్నీ జరిగితే ఇంకేముంది. అలా రష్మీ పెళ్ళికి బ్రేక్ పడింది. ఇక రష్మీ మ్యారేజ్ మేనియా నుంచి ఇప్పుడిప్పుడే ఆడియన్స్ అంతా బయటపడుతూ ఉన్నారు. సుధీర్ రష్మిని వదిలి వెళ్ళిపోయాక చాలామంది బాధపడ్డారు.
కానీ ఆ బాధను నెమ్మదిగా రష్మీ తన యాకరింగ్ తో తగ్గిస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ రష్మీ పెళ్లి కాన్సెప్ట్ తెరమీదకు వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో లో కార్తీక పౌర్ణమి సందర్భంగా రష్మీ ఒక కోరిక కోరింది . "ఓ దేవుడా...నేను మనసులో ఎవరిని కోరుకుంటున్నానో వాడే మొగుడుగా రావాలి" అని కోరుకుంది. దాంతో రామ్ ప్రసాద్ ఆగుతాడా . "ఎవరిని కోరుకున్నావ్ ..ఎవడు వాడు" అని అడిగేశాడు ఇక ఆగలేనట్టు నూకరాజు మిడిల్ ఎంట్రీ ఇచ్చి "ఎలా ఉంటాడో ఒక్క రెండు పోలికలు చెప్పవా" అని అడిగాడు "నాకు కాబోయే మొగుడు గుర్రం మీద వస్తాడు" అంటూ గిర్రున తిరుగుతూ సిగ్గే సిగ్గు పడేలా సిగ్గుపడుతూ మరీ చెప్పింది రష్మీ. ఇక ఇంద్రజమ్మ ఊరుకుంటుందా "అంతా బానే చెప్పారు.. కానీ వచ్చేది గుర్రం మీదనా..గోట్ మీదనా" అని డౌట్ పెట్టింది. దాంతో రష్మీ మరీ సిగ్గుపడిపోయిందనుకోండి. అంటే త్వరలో సుడిగాలి సుధీర్ నటించిన "గోట్" మూవీ రాబోతోంది అని ఇన్‌డైరెక్ట్ గా చెప్తున్నట్లు ఉంది. అంటే ప్రమోషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసినట్టే కనిపిస్తోంది. ఎం ఐడియా గురు...
![]() |
![]() |